'ప్రేమాభిషేకం'లో చేయడానికి భయపడ్డాను: జయసుధ

  • ఏఎన్నార్ తో మొదటి మూవీ 'మహాకవి క్షేత్రయ్య'
  • 'ప్రేమాభిషేకం' కోసం దాసరిగారు ఒప్పించారు
  • ఈ సినిమా ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టింది
ఎన్టీ రామారావుతోనే కాదు ..  అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి జయసుధ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. అక్కినేనితో కలిసి ఆమె మొదటిసారిగా 'మహాకవి క్షేత్రయ్య' సినిమా చేశారు. ఆ తరువాత కాలంలో వీళ్ల కాంబినేషన్లో వచ్చిన 'ప్రేమాభిషేకం' సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాను గురించి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో జయసుధ ప్రస్తావించారు.

'ప్రేమాభిషేకం' సినిమా సమయానికి నేను .. జయప్రద .. శ్రీదేవి టాప్ హీరోయిన్స్ గా వున్నాము. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవిని తీసుకున్నారు. ఇంకో హీరోయిన్ అవసరం .. ఆ పాత్రకి మేకప్ వుండకూడదు. నేను .. జయప్రద చేయమని దాసరి నారాయణగారు ఫిక్స్ అయ్యారు. కానీ ఒకసారి మమ్మల్ని అడగమని అక్కినేని చెప్పారట. దాంతో దాసరిగారు వచ్చి నన్ను అడిగారు. అవతల గ్లామరస్ హీరోయిన్ గా శ్రీదేవి .. నా పాత్రకి మేకప్ లేదు .. అందువలన ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని నేను చాలా భయపడ్డాను. కానీ నా పాత్రకే మంచి పేరు వస్తుందని దాసరిగారు ఒప్పించారు. నిజంగానే ఈ సినిమా నాకు ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చారు.     
Go Back to Shorts
jayasudha

More Telugu News